డెయిరీ ఉద్యోగుల పెండింగ్‌ జీతాలను ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-02-25T05:38:18+05:30 IST

ఒంగోలు డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పెండింగ్‌ బకాయిలను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహె చ్‌.మజుందార్‌ డిమాండ్‌ చేశారు.

డెయిరీ ఉద్యోగుల పెండింగ్‌ జీతాలను ఇవ్వాలి
డెయిరీ వద్ద నిరసన దీక్ష చేస్తున్న ఉద్యోగులు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 24 : ఒంగోలు డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పెండింగ్‌ బకాయిలను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహె చ్‌.మజుందార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక డెయిరీ ఎదుట ఉద్యోగులు, కార్మికులు బుధవారం రిలే దీక్షలను చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన మజుందార్‌ మాట్లాడుతూ డెయిరీ ఉద్యోగులను 2021 ఫిబ్రవరి వరకు ఉద్యోగాలను తొలగించబోమని, ఈలోపు ఒప్పందం ప్రకారం రావాల్సిన బకాయిలను చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చే స్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద పాలఫ్యాక్టరీ లో ఒకటైన ఒంగోలులోని డెయిరీని నడిపించడంలో ఇప్పటి వరకు పాలక వర్గాలు, ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ నష్టాలకు కారణమైన ప్రభుత్వం తన విధానాన్ని మార్చు కోకుండా అమూల్‌ సంస్థలకు అప్పగించడం దుర్మార్గంగా ఉందని విమర్శించారు. ఈవిఽధానాన్ని వెంటనే ఉపసంహ రించుకొని ఉద్యోగులకు బకాయిలతో పాటు అరియర్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పోరాట కమిటీ నా యకుడు నారాయణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బంకా సుబ్బారావు, నాయకులు కాటూరి శ్రీనివాస్‌, సీహెచ్‌. రాంబాబు, సాయి, ఈదర వెంకట్రావు, సుబ్బయ్య, రాఘవ రావు, కె.శ్రీనివాస్‌, గొల్లపూడి వెంకటేశ్వర్లు తదితరులు పా ల్గొన్నారు.


Updated Date - 2021-02-25T05:38:18+05:30 IST