ముగిసిన ఒంగోలు ఎద్దుల పోటీలు

ABN , First Publish Date - 2022-01-23T04:40:19+05:30 IST

ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా పట్టణంలోని వీవర్స్‌ కాలనీ మైదానంలో నిర్వహిస్తున్న ఒంగోలు ఎద్దుల బండలాగుడు బలప్రదర్శన పోటీలు ముగిశాయి.

ముగిసిన ఒంగోలు ఎద్దుల  పోటీలు
ప్రథమ బహుమతిని అందజేస్తున్న దృశ్యం

ప్రథమ స్థానంలో  కడప వృషభాలు 

ఎమ్మిగనూరు, జనవరి22: ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా పట్టణంలోని వీవర్స్‌ కాలనీ మైదానంలో నిర్వహిస్తున్న ఒంగోలు ఎద్దుల బండలాగుడు బలప్రదర్శన పోటీలు ముగిశాయి. చివరి రోజు శనివారం సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగంలో పోటీలు నిర్వహించారు. సబ్‌ జూనియర్స్‌ విభాగంలో గుంటూరు జిల్లా వేటపాలెంకు చె ందిన శిరీషచౌదరి ఎద్దులు 4065.05 అడుగు దూరాన్ని బండలాగి ప్రథమ బహుమతి రూ. 50వేలు గెలుచుకోగా, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాదల్‌గుల్‌కు చెందిన ఎల్చాల ప్రసన్నరెడ్డి ఎద్దులు 3546.04 అడుగు దూరాన్ని లాగి రెండో బహుమతిని గెలుచుకున్నాయి. అలాగే సంజామల మండలం, అనంతపురం జిల్లా మేడిమాకుల పల్లి గ్రామాలకు చెందిన ఎద్దులు 3000 అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతి రూ. 25వేలు గెలుచుకోగా, నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామానికి చెందిన భూమా గోవర్థనరెడ్డి ఎద్దులు 2838.02 అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతి రూ. 15వేలు, జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ గ్రామానికి  చెందిన ఎం రాయుడు ఎద్దులు 2716.07అడుగుల దూరాన్ని బండలాగి ఐదో బహుమతి రూ. 10వేలు గెలుచుకున్నాయి. మధ్యాహ్నం నుంచి జరిగిన సీనియర్‌ విభాగంలో కడప జిల్లా చౌటుపల్లికి చెందిన మార్తల చంద్ర ఓబులరెడ్డి ఎద్దులు 2798 అడుగుల దూరాన్ని బండలాగి ప్రథమస్థానంలో నిలిచి రూ. లక్ష బహుమతి గెలుచుకున్నాయి. అదే జిల్లాకు చెందిన చౌటుపల్లికిచెందిన చంద్ర ఓబులరెడ్డి, కాయనూరుకుచెందిన పెద్దశివకాంతరెడ్డిలకు చెందిన ఎద్దులు 2401అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతి రూ. 75వేలు గెలుచుకోగా, తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా దేవబండకు చెందిన భాస్కర్‌ గౌడ్‌  ఎద్దులు 2366.4 అడుగుల దూరాన్ని లాగి రూ. 50వేలు బహుమతిని గెలుచుకున్నాయి. అలాగే రామకృష్ణపురం శ్యామసుందర్‌రెడ్డి ఎద్దులు 2340.8 అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతి రూ. 30వేలు,  డోన మండలం కోత్తకోట గ్రామనిక చెందిన డా. గుర్నాథ్‌ ఎద్దులు 2303.5 అడుగు దూరాన్ని బండలాగి ఐదో బహుమతి గెలుచుకున్నాయి.  ఎడ్ల యజమానులకు వైసీపీ సీనియర్‌ నాయకుడు  జగన్మోహాన రెడ్డి నగదు బహుమతులను  అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బీఆర్‌ బసిరెడ్డి, సోగనూరు భీమిరెడ్డి, గాజుల కుమార్‌ స్వామి, గాజుల రాజు, సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ కేశన్న, మున్సిపల్‌ వైస్‌ చైర్మన నజీర్‌అహ్మద్‌, చాంద్‌, వ్యాఖ్యాతలు రామానాయుడ, అబ్దుల్‌కలాం, ఉస్మానబాషా, పీఈటీ లక్ష్మన్న పాల్గొన్నారు. 

కబడ్డీ విజేత యూనివర్సల్‌ జిమ్‌ జట్టు  

ఎమ్మిగనూరు టౌన, జనవరి 22:  పట్టణంలో నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా నిర్వహించిన తొలిసారి ఇండోర్‌ స్టేడియంలో ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో నిర్వహించిన అంతర్రాష్ట్ర పురుషుల కబడ్డీ పోటీలు శనివారంతో ముగిసాయి. ఫైనల్‌లో ఎమ్మిగనూరు యూనివర్సల్‌ జిమ్‌ జట్టు, బెంగళూరు జట్లు తలపడగా.. ఎమ్మిగనూరు యూనివర్సల్‌ జిమ్‌ జట్టు గెలుపొందింది. గెలుపొందిన విజేతకు రూ.60వేల నగదు, రన్నర్‌కు రూ.40వేల నగదుతో పాటు ట్రోఫీలను వైసీపీ నియోజకవర్గ ఇనచార్జి ఎర్రకోట జగన్మోహన రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన డా.రఘు, వైస్‌ చైర్మన నజీర్‌ అహ్మద్‌, నిర్వాహకులు రామక్రిష్ణ, అంజి, రామాంజి పాల్గొన్నారు. 

 వాలీబాల్‌ విజేత మంగళూరు జట్టు  

 నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర వాలీబాల్‌ పోటీల్లో మంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌ పోటీల్లో మంగళూరు జట్టు, చెట్నంపల్లి జట్టు తలపడగా.. మంగళూరు జట్టు గెలుపొందింది. విజేతకు రూ.40వేలు, రన్నర్‌కు రూ.30వేల నగదుతో పాటు ట్రోఫీలను వైసీపీ నియోజకవర్గ ఇనచార్జి ఎర్రకోట జగన్మోహన రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన డా. రఘు, వైస్‌ చైర్మన నజీర్‌ అహ్మద్‌, టౌన బ్యాంక్‌ చైర్మన రాజశేఖర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన బుట్ట రంగయ్య, నిర్వహకులు బాబాఖాన పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T04:40:19+05:30 IST