Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒంగోలులో డా.గుడారు జగదీష్ వైద్య సేవలు

ప్రకాశం: తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ఆసుపత్రి సంచాలకులుగా పదవీ విరమణ చేసిన డా. గుడారు జగదీష్ ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర హాస్స్పిటల్‌ను శనివారం సందర్శించి వివిధ రకాలైన ఎముకల సమస్యలతో బాధ పడుతున్న రోగులను పరిశీలించారు. అందులో శస్త్ర చికిత్స అవసరమైన ఆరుగురు చిన్నారులను, కీళ్ళ మార్పిడి అవసరమైన నలుగురు రోగులను ఎంపిక చేసి శస్త్ర చికిత్సలు చేయనున్నారు.


వీరిలో అధిక భాగం పుట్టుకతో వచ్చే వైకల్యంతో బాధ పడుతున్నారు. క్లబ్ ఫుట్‌తో బాధ పడుతున్న ఒక చిన్నారికి ఇది వరకే కుడి కాలుకి శస్త్ర చికిత్స చేసి సరి చేయగా కోవిడ్ కారణంగా ఎడమ కాలు ఆపరేషన్ చేయలేక పోయారు. ఇప్పుడు మళ్ళీ వైద్య సేవలు పునరుద్ధరించడంతో ఆ చిన్నారికి ఎడమ కాలు శస్త్ర చికిత్స చేయనున్నారు. మోకాలి కింది భాగంలోని కండరంలో ఏర్పడిన ట్యూమర్‌తో బాధ పడుతున్న రోగికి శస్త్ర చికిత్స చేయనున్నారు. కీళ్ళ మార్పిడి అవసరం ఉన్న నలుగురు రోగులకు ఒంగోలు రమేష్ సంఘమిత్ర ఆసుపత్రి‌లో శస్త్ర చికిత్సలు చేయనున్నారు.

మోకాళ్ళు, తుంటి కీలు, భుజం, మోచేయి కీళ్లతో పాటు, రుమటాయిడ్ ఆర్థరైటీస్, ఆస్టియో ఆర్ధరైటీస్ సమస్యలతో బాధ పడేవారు, పుట్టుకతో వచ్చిన అంగ వైకల్యంతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు డాక్టర్ గుడారు జగదీష్ ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. దివ్యాంగులతో పాటు అతిక్లిష్టంగా విరిగిన ఎముకల సమస్యలతో బాధపడేవారు, ఎటువంటి కీళ్ల వ్యాధులతో బాధపడుతున్న వారికైనా శస్త్రచికిత్స చేసి వారికి స్వస్థత చేకూరుస్తున్నారు. మోకీలు సమస్యతో బాధపడే వారికి ఆర్థోస్కోపీ (కీహోల్) సర్జరీ ద్వారా స్వస్థత పరిష్కారం చేకూర్చే దిశగా రోగులను పరీక్షించడంతో పాటు శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారు.


Advertisement
Advertisement