కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-25T05:20:59+05:30 IST

జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్ష రెండవ రోజు ప్రశాంతంగా కొనసాగింది.

కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు
ఉండవల్లిలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న తహసీల్దార్‌ వీరభద్రప్ప

- రెండవ రోజు హిందీ పరీక్షకు హాజరైన 7,915 మంది

- కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

గద్వాల టౌన్‌/ ఎర్రవల్లి చౌరస్తా/ ధరూరు/ కేటీదొడ్డి/  మల్దకల్‌/ ఉండవల్లి/ మానవపాడు/ రాజోలి/ మే 24 : జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్ష రెండవ రోజు ప్రశాంతంగా కొనసాగింది. మంగళవారం నిర్వహించిన ద్వితీయ భాష హిందీ పరీక్షకు జిల్లాలోని 41 కేంద్రాల్లో 8,013 మంది హాజరు కావాల్సి ఉండగా, 7,915 (98.78 శాతం) మంది హాజరయ్యారు. 98 మంది గైర్హాజరయ్యారు.


- గద్వాల పట్టణంలో ఏడు కేంద్రాలు, మండల పరిధిలోని అనంతపురంలోని ఒక కేంద్రంలో 2,054 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 2,033 మంది హాజరయ్యారు. 21 మంది పరీక్ష రాయలేదు.


- ఇటిక్యాల పరీక్ష కేంద్రంలో 239 విద్యార్థులకు గాను ఒకరు గైర్హాజరయ్యారు. కొండేరులో 165 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కోదండాపురంలో 149 మంది, ఎర్రవల్లిలో 143 మంది పరీక్ష రాశారు. నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను చీఫ్‌ సూపరిండెంట్లు చెన్నారెడ్డి, విజయ్‌భాస్కర్‌, వెంకటరంగయ్య, రమేష్‌ పరిశీలించారు.


- ధరూరు ధరూరు జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో 286 మంది విద్యార్థులకు గాను 283 మంది పరీక్షకు హాజర య్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. ఉప్పేరు పాఠశాలలో 285 మందికి గాను 280 మంది హాజరయ్యారు. ఐదు గురు పరీక్ష రాయలేదు. మార్లబీడు పాఠశాలలో 186 మందికి గాను 180 మంది పరీక్షకు హాజరైనట్లు ఎంఈవో సురేష్‌ తెలిపారు.


- కేటీదొడ్డి మండల పరిధిలోని నందిన్నె పరీక్ష కేంద్రంలో 144 మంది విద్యార్థులకు గాను, 141 మంది పరీక్ష రాశారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పాతపాలెంలో 132 మందికి గాను 132 మంది పరీక్ష రాశారు. కేంద్రాలను ఎంఈవో సురేష్‌ పరిశీలించారు.


- మల్దకల్‌ మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. రెండవ రోజు హిందీ పరీక్షకు మొదటి కేంద్రంలో ఆరుగురు, రెండవ కేంద్రంలో ఇద్దరు, మూడవ కేంద్రంలో ఇద్దరు, మొత్తం 10 మంది విద్యార్దులు గైర్హాజరైనట్లు మల్దకల్‌ మండల విద్యాశాఖాధికారి కొండారెడ్డి తెలిపారు. మొత్తం 478 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖాదికారి మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ తనిఖీ చేశారు. 

- ఉండవల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మూడు పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ నరేష్‌, కేశవ్‌, ఉండవల్లి తహసీల్దార్‌ వీరభద్రప్ప తనిఖీ చేశారు. మొత్తం 478 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 474 మంది హాజరయ్యారు. నలుగురు గైర్హాజరయ్యారని పరీక్ష కేంద్రాల ముఖ్య పర్యవేక్షకులు నిర్మలాజ్యోతి,  వెంకటే శ్వర్లు, అమరేందర్‌ రెడ్డి తెలిపారు.


- మానవపాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రెండో రోజు పదవతరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 299 మంది విద్యార్థులకు గాను, 292 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్లయింగ్‌ స్కాడ్‌ నరేష్‌ పరీక్షను పర్యవేక్షించారు.


- రాజోలి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 144 మందికి గాను 141 మంది పరీక్ష రాశారు. ముగ్గురు గైర్హాజ ర య్యారు. పాఠశాల అవరణలో రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మాల కొండయ్య ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. టీబీ సూపర్‌వైజర్‌ జయప్రకాష్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ రంజిత్‌ కుమార్‌, ఏఎన్‌ఎం సువర్ణ విధులు నిర్వహించారు.


- అయిజ మండలంలోని ఆరు పరీక్ష కేంద్రాల్లో 990 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 971 మంది రాశారు. 19 మంది గైర్హాజరయ్యారు. ఎస్‌ఐ నరేశ్‌ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 


- అలంపూర్‌ పట్టణంలోని నాలుగు కేంద్రాల్లో 711 మందికి గాను, 706 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఐదుగురు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను  ఎంఈవో అశోక్‌కుమార్‌, ప్లయింగ్‌ స్క్వాడ్‌ నరేశ్‌ తనిఖీ చేశారు.

Updated Date - 2022-05-25T05:20:59+05:30 IST