OUలో కొనసాగుతున్న టెన్షన్

ABN , First Publish Date - 2022-05-04T17:07:47+05:30 IST

ఉస్మానియా యూనివర్శిటీలో టెన్షన్ వాతవరణం కొనసాగుతోంది. ఎన్‌సీసీ గేట్, ఆర్ట్స్ కాలేజ్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

OUలో కొనసాగుతున్న టెన్షన్

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో టెన్షన్ వాతవరణం కొనసాగుతోంది. ఎన్‌సీసీ గేట్, ఆర్ట్స్ కాలేజ్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాహుల్ పర్యటనకు పాలక మండలి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. రంజాన్ సెలవుల కారణంగా రెండు రోజులుగా వీసీ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వీసీ వైఖరిపై తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓయులో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


Read more