హెచ్ఆర్ఏపై కొనసాగుతోన్న ప్రతిష్ఠంభన

ABN , First Publish Date - 2022-02-06T02:46:31+05:30 IST

మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు

హెచ్ఆర్ఏపై కొనసాగుతోన్న ప్రతిష్ఠంభన

అమరావతి: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు జరుగుతున్నాయి. అయితే హెచ్ఆర్ఏ విషయంలో ప్రతిష్ఠంభన. కొనసాగుతోంది. మంత్రుల కమిటీ ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. ఉద్యోగ సంఘాల వైపు నుంచి హెచ్ఆర్ఏ స్లాబులను పీఆర్సీ సాధన సమితి ప్రతిపాదించింది. హెచ్‌ఆర్ఏ స్లాబ్‌ 12 శాతంతో మొదలవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ స్థాయిలో హెచ్‌ఆర్ఏ స్లాబ్ ఫిక్స్ చేయడం కష్టమని మంత్రుల కమిటీ తెలిపింది. మంత్రుల అభ్యర్ధనతో ఉద్యోగ సంఘాలు కొత్త ప్రతిపాదన తెచ్చాయి. 10, 12, 16 శాతాల మేర హెచ్‌ఆర్ఏ స్లాబ్‌ను ఫిక్స్ చేయాలని విన్నవించాయి. సచివాలయం, హెచ్‌ఓడీ ఉద్యోగులకు 24 శాతం ఇవ్వాలని ప్రతిపాదించాయి. ఉద్యోగ సంఘాలు ప్రతిపాదనపై మంత్రుల కమిటీ మంతనాలు జరుపుతోంది.


Updated Date - 2022-02-06T02:46:31+05:30 IST