తిరుచానూరులో కొనసాగుతున్న ‘శ్రీయాగం’

ABN , First Publish Date - 2022-01-24T06:15:29+05:30 IST

ప్రపంచ శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నవకుండాత్మక శ్రీయాగం మూడో రోజైన ఆదివారం కూడా కొనసాగింది.

తిరుచానూరులో కొనసాగుతున్న ‘శ్రీయాగం’
యాగం నిర్వహిస్తున్న అర్చకులు

తిరుచానూరు, జనవరి 23: ప్రపంచ శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నవకుండాత్మక శ్రీయాగం మూడో రోజైన ఆదివారం కూడా కొనసాగింది. ఉదయం అమ్మవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి, మధ్యాహ్నం వరకు చతుష్టానార్చన, హోమాలు, లఘు పూర్ణాహుతి, మహా నివేదన, హారతి, వేద విన్నపం నిర్వహించారు. సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేశారు. టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి దంపతులు జరిపిస్తున్న ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T06:15:29+05:30 IST