కొనసాగుతున్న కడెం గేట్ల మరమ్మతులు

ABN , First Publish Date - 2022-08-08T05:50:09+05:30 IST

వరద బీభత్సానికి దెబ్బ తిన్న కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి క డెం ప్రాజెక్టు 11 గేట్లను మెకానికల్‌ సిబ్బంది కిం దికి దించారు.

కొనసాగుతున్న కడెం గేట్ల మరమ్మతులు


ఖానాపూర్‌, ఆగస్టు 7 : వరద బీభత్సానికి దెబ్బ తిన్న కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి క డెం ప్రాజెక్టు 11 గేట్లను మెకానికల్‌ సిబ్బంది కిం దికి దించారు. మరో ఏడు గేట్లు మాత్రమే ఇంకా కిందికి దించాల్సి ఉండగా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న పనులతో వాటి మరమ్మతులు సైతం త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు ఈఈ రాజ శేఖర్‌ గౌడ్‌ పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొన సాగుతున్నాయి. కడెం ప్రాజెక్టు గేట్లు అన్ని కిందికి దించితే ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోతున్న నీటిని నిలువ చేసి పంట కాలువల ద్వారా రైతన్న లకు సాగు నీటిని అందించే అవకాశం ఉన్నందున అధికారుల బృందం గేట్ల మరమ్మతు పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇంకా సమయం ఉన్నందున వానాకాలం సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తరచుగా రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల సీఈలతో పాటు ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావులు ప్రాజెక్టు వద్ద గేట్ల మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఎప్పటికప్పుడు కడెం ప్రాజెక్టు మరమ్మతులపై ఆరా తీస్తుండడంతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు చెబుతున్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేస్తే తమకు పంట సాగుకు అనుకూలంగా ఉంటుందని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-08T05:50:09+05:30 IST