భైంసా అల్లర్లపై కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

ABN , First Publish Date - 2021-03-22T15:57:47+05:30 IST

భైంసా అల్లర్లపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అల్లర్ల

భైంసా అల్లర్లపై కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

నిర్మల్: భైంసా అల్లర్లపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అల్లర్ల సందర్భంగా దాడులు, ఆస్తులను ధ్వంసం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వారియర్ తెలిపారు. సోఫియాన్, ముజమ్మిల్, నవాజ్, జుబేర్, ఔసాఫ్‌ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వారియర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఈ కేసులో నిందితులను ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసుతో సంబంధమున్న మరికొందరు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ వారియర్ తెలిపారు. 




భైంసాలో మార్చి 7వ తేదీన అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక వర్గంపై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ అల్లర్లకు దారితీసినట్లుగా భావిస్తున్నారు. అల్లర్లకు సంబంధించి గతంలో 38 మందిని అరెస్టు చేశారు. భైంసాలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాదాపు 26 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో దాదాపు 66 మందిని బైండోవర్ చేశారు.  

Updated Date - 2021-03-22T15:57:47+05:30 IST