కొనసాగుతున్న సాగర్‌ నీటి విడుదల

ABN , First Publish Date - 2021-10-19T06:02:52+05:30 IST

నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేటు ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 9,800 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండటంతో నీటి పారుదల శాఖాధికారులు వీయార్‌ నెంబర్‌ 5 గేట్లలోని 7వ గేటును ఎత్తి 7400 క్యూసెక్కుల వరద నీటిని మంజీరాలోకి విడుదల

కొనసాగుతున్న సాగర్‌ నీటి విడుదల
నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి

కనీస సౌకర్యాలు లేక పర్యాటకుల ఇక్కట్లు

నిజాంసాగర్‌, అక్టోబరు 18: నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేటు ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 9,800 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండటంతో నీటి పారుదల శాఖాధికారులు వీయార్‌ నెంబర్‌ 5 గేట్లలోని 7వ గేటును ఎత్తి 7400 క్యూసెక్కుల వరద నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ పూర్తి నీటి సామర్థ్యం 1405 అడుగులకు గాను 1404.92 అడుగుల నీటి సామర్థ్యాన్ని నిల్వ చేస్తూ, జెన్‌ కో గేట్ల ద్వారా 2400, వరద గేట్ల ద్వారా 7400 క్యూసెక్కుల చొప్పున మొత్తం 9800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ఉదృతిని బట్టి దిగువకు విడుదల చేస్తున్నట్లు డిప్యూటి ఈఈ శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 1 టీఎంసీ తక్కువగా ఉంచుతున్నట్లు తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేటు ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టుపై పర్యాటకుల తాకిడి తగ్గడం లేదు. పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Updated Date - 2021-10-19T06:02:52+05:30 IST