కొనసాగుతున్న వలసలు

ABN , First Publish Date - 2020-05-26T05:50:04+05:30 IST

వలస కూలీల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద గల లక్ష్మిపూర్‌ చెక్‌పోస్ట్‌ నుంచి సోమవారం వరకు

కొనసాగుతున్న వలసలు

అర్జునగుట్ట, లక్ష్మిపూర్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా వస్తున్న కూలీలు

24 గంటలు వైద్య సిబ్బంది, పోలీసుల తనిఖీలు


(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల)

వలస కూలీల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద గల లక్ష్మిపూర్‌ చెక్‌పోస్ట్‌ నుంచి సోమవారం వరకు 3,600 మం ది వలస కూలీలు జిల్లా నుంచి వెళ్ళగా జిల్లాలోకి 1,510 మంది వచ్చారు. భూపాలపల్లి, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ల నుంచి వస్తున్నవారు ఈ చెక్‌ పోస్ట్‌ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, ఝార్ఖండ్‌కు వెళ్తున్నారు. బస్సుల్లో,  ఇతర వాహనాలలో తరలిస్తున్నారు. వైద్య బృందం ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసి అనుమతిస్తున్నారు. గ్రామాల్లోకి కొత్తవారు వస్తే సమాచారం ఇవ్వాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు రెవెన్యూ, పోలీసులు సూచించారు. ముంబై కూలీలు హోం క్వారంటైన్‌లో ఉన్న ప్రాంతాలలో పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మున్సి పాలిటీలలో మాస్క్‌ ధరించని వారికి జరిమానాలు వేస్తున్నారు. ఇక జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  

Updated Date - 2020-05-26T05:50:04+05:30 IST