కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-29T04:58:00+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో నాలుగవ రోజు గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం మ్యాథ మెటిక్స్‌-1బీ, జూవాలజీ, హిస్టరీ పరీక్షలకు 2,938 మంది విద్యార్థులు హాజరయ్యారు.

కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు
గద్వాల పట్టణంలోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి హృదయరాజు

- నాలుగో రోజు 2,938 మంది విద్యార్థులు హాజరు

గద్వాల టౌన్‌, అక్టోబరు 28 :  జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో నాలుగవ రోజు గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం  మ్యాథ మెటిక్స్‌-1బీ, జూవాలజీ, హిస్టరీ పరీక్షలకు 2,938 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 2,455 మంది జనరల్‌, 483 మంది వృత్తి విద్యా కోర్సుల వారు ఉన్నారు. గద్వాల జోన్‌ పరిధిలోని ఏడు కేంద్రాల్లో 1,117 జనరల్‌, 318 మంది వృత్తివిద్య పరీక్ష రాశారు. అయిజ జోన్‌లోని నాలుగు కేంద్రాల్లో 566 మంది జనరల్‌, 113 మంది వృత్తివిద్య కోర్సుల వారు మొత్తం 679 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ధరూరు, అలంపూరు, గట్టు, మానవపాడు, మల్దకల్‌ కేంద్రాల్లో 772 మంది జనరల్‌, 52 మంది వృత్తి విద్య కోర్సుల విద్యార్థులు 824 మంది హాజరయ్యారు. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలురు, కృష్ణవేణి, సాధన జూనియర్‌ కళాశాలల కేంద్రాలను ఇంటర్మీడియల్‌ నోడల్‌ అధికారి ఎం. హృదయరాజు తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారి ప్రతీ విద్యార్థి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, కేంద్రానికి నిర్ణీత సమయానికి అరగంట ముం దుగానే చేరుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, హుజురా బాద్‌ ఉపఎన్నిక కారణంగా శుక్రవారం, శని వారం పరీక్షలు ఉండవని నోడల్‌ అధికారి తెలిపారు. ఈ నెల 31న ఆదివారం సైన్స్‌ విద్యార్థులకు ఫిజిక్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకు ఎకనా మిక్స్‌ పరీక్షలు ఉంటాయని వివరించారు.


పరీక్షా కేంద్రం తనిఖీ

మల్దకల్‌ : మల్దకల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని గురువారం సిట్టింగ్‌ స్వ్కాడ్‌ బృందం సభ్యులు వెంకట కృష్ణమాచార్యులు, శేఖర్‌ తనిఖీ చేసినట్టు ఛీప్‌ సూపరిండెంట్‌  నర్సింహులు తనిఖీ చేశారు. మొత్తం 49 మందికి గాను 42 మంది  విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. హుజూరాబాద్‌లో ఎన్నికలు ఉన్నందున శుక్ర, శనివారాల్లో పరీక్షలు ఉండవని పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-29T04:58:00+05:30 IST