ప్రశాంతంగా రెండో రోజు పరీక్ష

ABN , First Publish Date - 2021-10-27T05:13:51+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రెండవ రోజు మంగళవారం ప్రశాంతంగా కొనసా గాయి.

ప్రశాంతంగా రెండో రోజు పరీక్ష
గద్వాల ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న హృదయరాజు

- కొనసాగుతున్న ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు

- హాజరైన 3,875 మంది విద్యార్థులు  

- కేంద్రాలను తనిఖీ చేసిన నోడల్‌ అధికారి హృదయరాజు 

గద్వాల టౌన్‌/అయిజ, అక్టోబరు 26 : ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రెండవ రోజు మంగళవారం ప్రశాంతంగా కొనసా గాయి. జిల్లాలోని 16 కేంద్రాల్లో ఇంగ్లీష్‌ పేపర్‌-1 పరీక్షకు 3,875 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులు 3,752 మందికి, 3,392 మంది హాజరు కాగా, 360 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 549 మందికి గాను 483 మంది పరీక్ష రాశారు. 66 మంది గైర్హాజరయ్యారు. గద్వాల పట్టణంలోని ఏడు కేంద్రాల్లో 1,468 మంది జనరల్‌, 319 మంది వృత్తి విద్యా కోర్సు విద్యార్థులు, మొత్తం 1,787 మంది హాజరు కాగా, 154 మంది గైర్హాజరయ్యారు. అయిజ జోన్‌ పరధిలోని నాలుగు కేంద్రాల్లో 826 మంది జనరల్‌, 112 మంది వృత్తి విద్య, మొత్తంగా 938 మంది పరీక్ష రాశారు. 133 మంది గైర్హాజరయ్యారు. ధరూరు, అలంపూరు, గట్టు, మానవపాడు, మల్దకల్‌ కేంద్రాల్లో 1,098 మంది జనరల్‌, 52 మంది వృత్తి విద్య కలిపి 1,150 మంది హాజరుకాగా, 139 మంది గైర్హాజరయ్యారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా నోడల్‌ అధికారి ఎం.హృదయరాజు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అయిజ పట్టణంలోని నాలుగు ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను మంగళవారం పరీక్షల విభాగం జిల్లా కమిటీ సభ్యులు  పద్మావతి, దేవేందర్‌రెడ్డి పరిశీలించారు. 


Updated Date - 2021-10-27T05:13:51+05:30 IST