Abn logo
Nov 25 2021 @ 23:45PM

సరిహద్దులో కొనసాగుతున్న తనిఖీ

లారీని తనిఖీ చేస్తున్న పోలీసులు

- 16 ధాన్యం లారీలను వెనక్కి పంపిన అధికారులు

    అలంపూర్‌ చౌరస్తా, నవంబరు 25 : జిల్లా సరిహద్దులోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ కొనసాగుతోంది. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తు న్నారు. బుధవారం రాత్రి ఏపీ నుంచి వస్తున్న దాదాపు 350 లారీలను తనిఖీ చేశారు. అందులో 16 లారీలు ధాన్యం లోడుతో నంద్యాల, ప్రొద్దుటూరు, బేతంచెర్ల, జమ్మిలమడుగు తదితర ప్రాంతాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాటిని వెనక్కి పంపించినట్లు వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. ట్రైనీ ఎస్‌ఐలు శ్రీవర్ధన్‌, కె.వాణిరెడ్డి, సిబ్బంది సురేందర్‌, మద్దయ్య, శ్రీధర్‌లు వాహనాల తనిఖీ నిర్వహించారు.