Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కొనసాగుతున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

twitter-iconwatsapp-iconfb-icon
కొనసాగుతున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలుషాద్‌నగర్‌: నిర్థవెల్లిలో పాదయాత్ర ప్రారంభిస్తున్న వీర్లపల్లి శంకర్‌

ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/మాడ్గుల/శంషాబాద్‌/కొత్తూర్‌/యాచారం/కందుకూరు/ చేవెళ్ల/ కేశంపేట/షాద్‌నగర్‌, ఆగస్టు 12:  స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆమనగల్లులో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో సీడీపీవో సక్కుబాయి  నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. న్యామతాపూర్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ పాల్గొన్నారు. కడ్తాల్‌లో ముస్లిం మైనార్టీలు తిరంగ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మజీద్‌బాబా మజీద్‌ అర్షద్‌లలో ప్రార్థనలు చేశారు. పలు వాడల్లో తిరంగ ర్యాలీ నిర్వహించారు. గాంధీ, అంబేద్కర్‌  విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సొసైటీ చైర్మన్‌ గంప వెంకటేశ్‌, సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గులలో మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా గ్రామాల పంచాయతీలకు ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అదేవిధంగా శంషాబాద్‌లో జడ్పీటీసీ నీరటి తన్వీరాజు ఆయన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా కొత్తూర్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా ర్యాలీ నిర్వహించారు. వై జంక్షన్‌ నుంచి ప్రధాన రహదారి, మున్సిపాలిటీ కార్యాలయం మీదుగా పోలీ్‌సస్టేషన్‌ వరకు భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఆర్‌పీఎఫ్‌ అధికారులను, సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్య దేవేందర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ డోలీ రవీందర్‌, ఎంపీటీసీ చింతకింది రాజేందర్‌గౌడ్‌, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, సీఐ బాల్‌రాజ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వీరేందర్‌, మేనేజర్‌ కుమార్‌ పాల్గొన్నారు. యాచారం మండల పరిషత్‌ కార్యాలయంలో యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యబాషా ఎస్సై శంకరయ్యకు రాఖీ కట్టారు. ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్‌ సుచరిత, ఎంపీవో ఉమారాణి యువకులకు రాఖీ కట్టారు.  మహేశ్వరం నియోజకవర్గం పరిదిలోని బడంగ్‌పేటలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి జెండా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి యం మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు. కందుకూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మంద జ్యోతి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌ సురేందర్‌రెడ్డిలు దివ్యాంగులకు నిత్యావసర సరుకులను అందజేశారు. వజ్రోత్సవాల సందర్భంగా చేవెళ్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రవేశ ద్వారాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కేశంపేటలోని నిర్ధవెల్లి నుంచి కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ నేతృత్వంలో శుక్రవారం ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్రను ప్రారంభించారు. కేశంపేట మండల కేంద్రం వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు గూడ వీరేశ్‌, జగదీవ్వర్‌, శ్రీధర్‌రెడ్డి, పెంటయ్య, భాస్కర్‌గౌడ్‌, రమేష్‌, రూప్లానాయక్‌, అనసూయ, తమ్మల గోపాల్‌, యాదగిరిచారి పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో బీజేపీ యువమోర్చా తిరంగ్‌ కార్యక్రమానికి బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బుల్బుల్‌ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేపల్లి అశోక్‌గౌడ్‌, శ్రీవర్దన్‌రెడ్డి, కె.వెంకటేష్‌గుప్తా, అందె బాబయ్య, విష్ణువర్దన్‌ పాల్గొన్నారు.

16, 17 తేదీల్లో చేవెళ్ల జోనల్‌ స్థాయి వజ్రోత్సవ ఫ్రీడం కప్‌ టోర్నమెంట్‌

చేవెళ్ల,  ఆగస్టు 12:  స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శంకర్‌పల్లిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో వజ్రోత్సవ ఫ్రీడం కప్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్‌ జోనల్‌ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం వారు చేవెళ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో సమావేశమయ్యారు. టోర్నమెంట్‌లో వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, టెన్నీస్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9948067214, 9177563956, 9616886274 ఫోన్‌ నంబర్లకు సంప్రదించి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.