Abn logo
Sep 24 2021 @ 19:51PM

సాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్‌: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి శుక్రవారం కూడా వరద రాక కొనసాగింది. దీంతో సాగర్‌ ప్రాజెక్టు నాలుగు క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 590అడుగులు నమోదైంది. సాగర్‌ నుంచి కుడికాల్వ ద్వారా 8,144 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 7,190 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్‌కేంద్రం నుంచి 32,561 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, నాలుగు క్రస్ట్‌గేట్ల నుంచి 32,400 క్యూసెక్కులు మొత్తంగా 82,095 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు జలవిద్యుత్‌కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,160 క్యూసెక్కులు, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులు మొత్తంగా  62,944 క్యూసెక్కుల నీటిని సాగర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు(215.8070టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 882.50అడుగులు (202.0439టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి 54,556 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 

ఇవి కూడా చదవండిImage Caption