Sriramsagar ప్రాజెక్ట్‌లోకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-26T15:48:49+05:30 IST

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Sriramsagar ప్రాజెక్ట్‌లోకి కొనసాగుతున్న వరద

నిజామాబాద్: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌(Sriramsagar project)లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 60,820 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 18 గేట్లు ఎత్తి 49,968 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు, ప్రస్తుతం 1087.6 అడుగులు, 75.145 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-26T15:48:49+05:30 IST