Musi ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-06-28T15:47:51+05:30 IST

జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Musi ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్లగొండ: జిల్లాలోని మూసీ (Musi) ప్రాజెక్టుకు వరద ప్రవాహం  కొనసాగుతోంది. దీంతో అధికారులు ఐదు గేట్లు (3,4,7,8,10) అడుగున్నర మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో నిల్‌‌గా ఉండగా... అవుట్ ఫ్లో 4169.34 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులకు గాను... ప్రస్తుత సామర్థ్యం 643.61 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.96 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-06-28T15:47:51+05:30 IST