శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-09-28T00:35:45+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు 5 లక్షల 29 వేల 964 క్యూసెక్కులు ఇన్ ఫ్లో

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు 5 లక్షల 29 వేల 964 క్యూసెక్కులు ఇన్ ఫ్లో, 5 లక్షల 94 వేల 580 క్యూసెక్కులు ఔట్ ఫ్లో  ఉందని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 884.00 అడుగులు ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 210.0320 టీఎంసీలు. ప్రస్తుతం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2020-09-28T00:35:45+05:30 IST