కొనసాగుతున్న కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-11T05:35:09+05:30 IST

మండలంలో ఆరో రోజు కర్ఫ్యూ కొనసాగుతోంది.

కొనసాగుతున్న కర్ఫ్యూ
చాగలమర్రిలో నిర్మానుష్యంగా ఉన్న గాంధీబజార్‌

  1. నిర్మానుష్యంగా మారిన రహదారులు


చాగలమర్రి, మే 10: మండలంలో ఆరో రోజు కర్ఫ్యూ కొనసాగుతోంది. సోమవారం చాగలమర్రిలోని ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం 12 గంటల తరువాత గ్రామంలోని అన్ని దుకాణాలను ఎస్‌ఐ మారుతీ, పోలీసులు మూసి వేయించారు.  


ప్రజలు సహకరించాలి: డీఎస్పీ 

 కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. సోమవారం చాగలమర్రి గ్రామంలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రజలు ఎవరు బయటకు రాకూడదని అన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ మారుతీ, హెడ్‌కానిస్టేబుల్‌ బలరాముడు ఉన్నారు. 


రుద్రవరం:  కర్ఫ్యూ ఆరో రోజు కొనసాగుతోంది. సోమవారం రుద్రవరం, చిన్నకంబలూరు, ఆలమూరు, నరసాపురం, ఇంకా పలు గ్రామాల్లో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. 


ఓర్వకల్లు: కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలు, వాహనదారులు, యజమానులపై కేసు లు నమోదు చేస్తామని తహసీల్దార్‌ శివరాముడు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. సోమవారం మండలంలోని హుశేనాపురం, గుట్టపాడు, ఓర్వకల్లు, నన్నూరు, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు తదితర గ్రామాల్లో కర్ఫ్యూను సమీక్షించారు. 


దొర్నిపాడు: కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్‌ఐ కీర్తి అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు కొనసాగించి మూసి వేయాలని అన్నారు.


శిరివెళ్ల: కర్ఫ్యూ నిబంధనలను ప్రజలు పాటించాలని ఇన్‌చార్జి తహసీల్దార్‌ మాధవ అన్నారు. మండలంలో అమలవుతున్న పగటి కర్ఫ్యూను ఎస్‌ఐ సూర్యమౌళితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. 

Updated Date - 2021-05-11T05:35:09+05:30 IST