చెరువులో కొనసాగుతున్న గాలింపు

ABN , First Publish Date - 2022-10-08T03:27:24+05:30 IST

నర్సింగాపూర్‌ ఊర చెరు వులో గురువారం గల్లంతైన పెద్దల మాంతయ్య, పెద్దల పోశంల కోసం గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. శుక్రవారం తహసీల్దార్‌ వాసంతి, ఆర్‌ఐ అరుణ, శ్రీరాంపూర్‌ సీఐ బి. రాజు, జైపూర్‌ ఎస్‌ఐ గంగారాంగౌడ్‌, ఏఎస్‌ఐ భూమన్నలు జాలర్లతో, మర పడవలతో చెరువులో గాలింపు చర్యలు చేప ట్టారు.

చెరువులో కొనసాగుతున్న గాలింపు
చెరువు వద్ద గుమిగూడిన ప్రజలు

భీమారం, అక్టోబరు 7: నర్సింగాపూర్‌ ఊర చెరు వులో గురువారం గల్లంతైన పెద్దల మాంతయ్య, పెద్దల పోశంల కోసం గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. శుక్రవారం  తహసీల్దార్‌ వాసంతి, ఆర్‌ఐ అరుణ, శ్రీరాంపూర్‌ సీఐ బి. రాజు, జైపూర్‌ ఎస్‌ఐ గంగారాంగౌడ్‌, ఏఎస్‌ఐ భూమన్నలు జాలర్లతో, మర పడవలతో చెరువులో గాలింపు చర్యలు చేప ట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలిం పు చర్యలు చేపట్టినా గల్లంతైన వారి ఆచూకీ దొర కలేదు. సర్పంచు దుర్గం మల్లేష్‌, ఎంపీటీసీ పెద్దల రూపలు మర పడవలను తెప్పించారు. పరిస్థితిని చెరువు వద్దనే ఉండి పరిశీలిస్తున్నారు. గల్లంతైన వారి కుటుంబీకులు చెరువు వద్దనే ఉండి రోదిస్తున్న తీరు పలువుర్ని కలచివేసింది.  అన్నదమ్ములు చెరువులో గల్లంతు కావడంతో రెండు రోజుల నుంచి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిషన్‌ కాకతీయ పనులతో చెరువు  లోతు గా మారడంతో గడ్డి, పిచ్చి మొక్కలు ఉండడంతో గల్లైంతన వారు ఆచూకీ దొరకడం లేదని పలువురు పేర్కొం టున్నారు. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ గాలింపు చర్యలను పరిశీలించారు.  రాత్రి కావ డంతో నిలిపివేసినట్లు తెలిపారు.  గోదావరిఖని, వేమనపల్లి, మంచి ర్యాల నుంచి రెస్య్కూటీంలను రప్పించి శనివారం గాలింపు  చేపడుతామన్నారు.

 

Updated Date - 2022-10-08T03:27:24+05:30 IST