Abn logo
Apr 16 2021 @ 15:04PM

పంచాయతీ సెక్రెటరీ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

విశాఖ: ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో పైడి భీమవరం పంచాయతీ గ్రేడ్ 1 సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రావుపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో అక్రమాస్తులు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఇంట్లోనే సుమారు రూ. 35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అత్యంత విలువైన బంగారు నగలు, ఆభరణాలు, వెండి వస్తువులను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ళ స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్న పత్రాలు లభ్యమయ్యాయి. విజయనగరం జిల్లాలో భారీగా భూములు కూడబెట్టినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. బ్యాంక్  లాకర్లు ఉన్నాయేమోనని ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 విశాఖలోని ఇంట్లో భారీగా ఉన్న వివిధ బ్యాంకుల పాస్‌బుక్స్‌ను గుర్తించారు. నెల్లిమర్ల, పైడి భీమవరం, రాజాం ప్రాంతాల్లో నాలుగు బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన సోదాల మేరకు ప్రభుత్వం లెక్కల ప్రకారం రూ. 5 కోట్ల పైబడి  ఆస్తులు వుంటాయని ఏసీబీ అంచనా వేసింది. గ్రేడ్ 1 పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తూ కోట్ల ఆస్తులు కూడబెట్టడంపై ఏసీబీ అధికారులు నివ్వెరపోతున్నారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రామమూర్తి ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. .


Advertisement
Advertisement
Advertisement