Abn logo
Feb 20 2020 @ 04:30AM

కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

శ్రీకాకుళంలో రెండోరోజూ విస్తృతంగా తనిఖీలు 

ఐదు అనధికార భవన నిర్మాణాలు గుర్తింపు


అరసవిల్లి, ఫిబ్రవరి 19 : శ్రీకాకుళం నగర పాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో పక్కా ప్లానింగ్‌తో అధికారులు అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ‘కర్ర విరగదు... పాము చావదన్న’ రీతిలో ప్లానింగ్‌ తీసుకున్న లబ్ధిదారుడు లంచం ఇచ్చామని చెప్పడు. అధికారులు లంచం తీసుకున్నామని ఒప్పుకోరు. కానీ అవినీతి మాత్రం అనధికార బిల్డింగుల రూపంలో నగరంలో అడుగడుగునా నిర్మాణ రూపం దాల్చుకున్నాయి. 


ఇదీ ఏసీబీ సోదాల్లో వెలుగుచూసిన ప్లానింగ్‌ అధికారుల అవినీతి భాగోతం. శ్రీకాకుళం నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం నుంచి ప్రారంభించిన సోదాల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయంలో తొలిరోజు సోదాల్లో మూడు అనధి కార భవన నిర్మాణాలను గుర్తించడంతో పాటు సిబ్బం ది వద్ద రూ.14,600 నగదును అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బుధవారం కూడా దాడులు కొనసాగిం చారు. టౌన్‌ప్లానింగ్‌ శాఖలో అవినీతిపై రాష్ట్ర వ్యాప్తం గా వచ్చిన ఫిర్యాదుల్లో భాగంగా కార్యాలయంలోనే కంప్యూటర్లలో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. ఈ దరఖాస్తుల్లో సుమోటాగా 5 భవనాలను పరిశీలించా లని నిర్ణయించారు.


ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వ ర్యంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి క్షేత్ర స్థాయిలో అక్రమ భవన నిర్మాణాలను అధికారులు పరి శీలించారు. నగరంలోని కత్తెరవీధిలో గుడ్ల కేశవరావు మూడంతస్థుల భవనాన్ని.. ప్లానింగ్‌ అనుమతి లేకుం డానే నిర్మించినట్లు గుర్తించారు. రామకృష్ణానగర్‌లోని డబ్బీరు వెంకటసంతోష్‌ కుమార్‌, మంగువారితోటలోని చెన్నా శ్రీనివాసరావు, నాగుల చంద్రరావు, మహలక్ష్మీ నగర్‌ కాలనీలోని సూరపు చలపతిరావులు అనుమ తులు లేకుండానే భవన నిర్మాణాలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ధ్రువీకరించారు. మంగువారితోటలోని చెన్నా శ్రీనివాసరావు ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని సైతం ఆక్ర మించినట్లు ఏసీబీ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అలాగే నగరంలోని పలుచోట్ల నిర్మాణ పనులు చేపడుతున్న భవనాలను కూడా ఏసీబీ అధికారులు ప్లానింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. 


సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం :

టౌన్‌ ప్లానింగ్‌ శాఖలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు సోదాలు చేపట్టాం. ప్లానింగ్‌ అనుమతి తీసుకోకుండా నిర్మించిన ఐదు భవనాలను గుర్తించాం. అనధికారికంగా భవనాలు నిర్మించినా, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నాం. మూడోరోజు గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది.

- ఏసీబీ డీఎస్పీ బీఎస్‌వీవీ రమణమూర్తి 

Advertisement
Advertisement
Advertisement