ఓఎన్జీసీ బావిలో ఆయిల్‌ చోరీ

ABN , First Publish Date - 2021-04-16T06:07:32+05:30 IST

కేజీ బేసిన్‌ పరిధిలోని వాసాలతిప్ప ఓఎన్జీసీ జి.ఎస్‌-15 బావి నుంచి గురువారం వేకువ జామున ఆయిల్‌ చోరీ చేశారు.

ఓఎన్జీసీ బావిలో ఆయిల్‌ చోరీ
ఆయిల్‌ చోరీ చేస్తున్న దృశ్యం

ఉప్పలగుప్తం, ఏప్రిల్‌ 15: కేజీ బేసిన్‌ పరిధిలోని వాసాలతిప్ప ఓఎన్జీసీ జి.ఎస్‌-15 బావి నుంచి గురువారం వేకువ జామున ఆయిల్‌ చోరీ చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఓఎన్జీసీ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. గతంలో ఈ బావికి ఓఎన్జీసీ క్యాపింగ్‌ చేసింది. చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేసింది. అయితే వెల్‌ వాల్వ్‌ను తెరిచి పైప్‌ల ద్వారా పీపాల్లోకి క్రూడాయిల్‌ను నింపుతున్న వైనాన్ని గమనించిన స్థానికులు గుట్టు రట్టు చేశారు. జగ్గరాజుపేట నుంచి ఓఎన్జీసీ సిబ్బంది వెళ్లి వాల్వ్‌ను సరిచేశారు. అమలాపురం రూరల్‌ సీఐ జి.సురేష్‌బాబు, స్థానిక ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావు బావి వద్ద పరిస్థితిని సమీక్షించారు. బావి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ పోలీసుల రక్షణలో ఉంటుందని ఐ.ఎం జగన్నాథరావు తెలిపారు. ఓఎన్జీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు  ఎస్‌ఐ తెలిపారు. బావి వద్ద తగిన రక్షణ ఏర్పాటు చేయలేదంటూ గ్రామస్థులు గురువారం ఆందోళనకు దిగారు. మూత వేసిన బావి నుంచి ఆయిల్‌ పట్టుకు పోతున్నారంటే ఏదైనా ప్రమాదం జరిగితే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటంటూ అధికారులను నిలదీశారు. వెల్‌ వద్ద ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-16T06:07:32+05:30 IST