డైట్‌ విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-01T11:16:16+05:30 IST

మేనేజిమెంట్‌ కోటాలో డీఈడీ చదివిన డైట్‌ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర విద్యాశా ఖామంత్రి ఆదిమూ లపు సురేష్‌ను కోరారు.

డైట్‌ విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలి

మంత్రి సురేష్‌కు వినతి

ఎర్రగొండపాలెం, అక్ట్టోబరు 31: మేనేజిమెంట్‌ కోటాలో డీఈడీ చదివిన డైట్‌ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర విద్యాశా ఖామంత్రి ఆదిమూ లపు సురేష్‌ను కోరారు. ఈమేరకు శనివారం ఎర్రగొండ పాలెంలో మంత్రిని కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. ఎర్రగొండపాలెంలోని డీఈడీ కాలేజి కరస్పాండెంట్‌ సూరే రమేష్‌  మాట్లాడుతూ 600 మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేశారన్నారు. వీరు పరీక్షలు రాసేందుకు అ నుమతి ఇప్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మేనేజ్‌ మెంట్‌ కోటాలో డీఈడీ చదివిన విద్యార్థులు 20వేల మంది ఉన్నారని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఆదిత్య డీఈడీ కాలేజి కరస్పాండెంట్‌ సూరే రమేష్‌, మ దర్‌ థెరిస్సా కాలేజి కరస్పాండెంట్‌ వెంకటేశ్వరనాయక్‌, విద్యార్థులు ఉన్నారు. 

Updated Date - 2020-11-01T11:16:16+05:30 IST