మోటార్‌బైక్‌ ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2020-11-01T11:13:10+05:30 IST

పాలకోసం రోడ్డుపైకి వచ్చిన మహిళను అతివేగంగా వస్తున్న మోటార్‌ బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా బైక్‌ చోదకులను అరెస్ట్‌ చేయాలని కోరుతూ గ్రామస్థులు మృతదేహంతో ధర్నా చేపట్టారు.

మోటార్‌బైక్‌ ఢీకొని మహిళ మృతి

మృతదేహంతో గ్రామస్థుల ధర్నా


 యద్దనపూడి, అక్టోబరు 31 : పాలకోసం రోడ్డుపైకి వచ్చిన మహిళను అతివేగంగా వస్తున్న మోటార్‌ బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో  మహిళ మృతిచెందగా బైక్‌ చోదకులను అరెస్ట్‌ చేయాలని కోరుతూ గ్రామస్థులు మృతదేహంతో ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మం డలంలోని చింతపల్లిపాడుకు చెందిన బత్తుల మరియమ్మ(50) శుక్రవారం రాత్రి పాలకోసం రోడ్డుపైకి రాగా యనమదలకు చెందిన కొందరు యువకులు అతి వేగంగా ద్విచక్రవాహనాన్ని నడుపుతూ ఆమెను ఢీకొట్టారు. తీవ్ర గాయాలైన ఆమెను చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించగా శనివారం మధ్యాహ్నం మృతిచెందింది. అనంతరం యద్దనపూడి పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఐతే ఢీకొట్టిన ద్విచక్రవాహనదారులను అరెస్ట్‌ చేయాలని కోరుతూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఽధర్నా చేశారు. యద్దనపూడి హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


బాణసంచా స్వాధీనం

నాగులుప్పలపాడు, అక్టోబరు 31 : ఒమ్మెవరం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను శుక్రవారం అర్ధరాత్రి నాగులుప్పలపాడు పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన శ్రీరాములు, సురేష్‌ ఎటువంటి అనుమతులు లేకుండా అమ్మకానికి ఉంచిన సుమారు రూ.లక్ష విలువ చేసే బాణసంచాను పట్టుకున్నట్లు ఎస్‌ఐ శశికుమార్‌ చెప్పారు. లైసెన్సు లేకుండా అక్రమంగా  టపాసులు నిల్వచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-11-01T11:13:10+05:30 IST