Abn logo
Jun 4 2020 @ 23:42PM

ఓ పక్క సుందరమ్మ మరోపక్క కామ్రేడ్‌ భారతక్క!

పెళ్లైన తర్వాత ప్రియమణి కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నారు. సెకండ్‌ ఇన్నింగ్‌లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకుంటున్నారు. తాజాగా ప్రియమణి వెంకటేశ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ‘నారప్ప’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె సుందరమ్మగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. దీనితోపాటు రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విరాట పర్వం’లో కామ్రేడ్‌ భారతక్క పాత్రలో నటిస్తున్నారు. గురువారం ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు చిత్రాల్లోని ప్రియమణి  పాత్రల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది, సుందరమ్మ పాత్ర తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. డి.సురేశ్‌బాబు, కలైపులి యస్‌.ఽథాను ఈ చిత్రానికి  నిర్మాతలు. 


భారతక్క పాత్ర కీలకం 

‘‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్‌  విప్లవంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో ‘విరాటపర్వం’లో ప్రియమణి పోషిస్తున్న భారతక్క పాత్ర అంతే కీలకం’’ అని రానా దగ్గుబాటి ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. భారతక్క పాత్ర తనను ఎంతో ఆకట్టుకుందనీ, ఆ పాత్రను ప్రేమించడం వల్లే యాక్ట్‌ చేయడానికి అంగీకరించాననీ ప్రియమణి తెలిపారు. షూటింగ్‌ చివరి దశలో ఉందని నిర్మాతలు డి.సురేశ్‌ బాబు, సుధాకర్‌ చెరుకూరి చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement