కొవ్వూరు క్వారంటైన్‌కు ఒకరి తరలింపు

ABN , First Publish Date - 2020-03-29T10:53:53+05:30 IST

ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చిన వారిని వైద్యసిబ్బంది గుర్తించి స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినా కొంతమంది మాట

కొవ్వూరు క్వారంటైన్‌కు ఒకరి తరలింపు

తాళ్లపూడి మార్చి 28 : ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చిన వారిని వైద్యసిబ్బంది గుర్తించి స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినా కొంతమంది మాట వినకపోవడంతో అందులో ఒకరిని కొవ్వూరు క్వారంటైన్‌కు తాళ్లపూడి వైద్యులు తరలించారు.


చత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన తాళ్లపూడికి చెందిన ఒక వ్యక్తి ఆరు బయట తిరుగుతుండడంతో స్థానికులు హడలెత్తిపోయారు. సమాచారం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో చర్చనీయాంశమైంది. మండలంలోని మూడు ప్రభుత్వాసుల పరిధిలో 30 మంది గృహనిర్బంధంలో ఉండగా అందులో 22 మందికి 28 రోజులు స్వీయనిర్బంధం పూర్తికాగామరో ఆరుగురు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

Updated Date - 2020-03-29T10:53:53+05:30 IST