Oneplus నుంచి అదిరిపోయే ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్.. ఏకంగా అంత జీబీ ర్యామే.. పండగో..!

ABN , First Publish Date - 2022-08-12T22:41:45+05:30 IST

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వన్‌ప్లస్ (Oneplus) సంస్థ కీలక ప్రకటన చేసింది. వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న వన్‌ప్లస్ 10టి (OnePlus 10T) స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు (Smartphone Sales) భారత్‌లో..

Oneplus నుంచి అదిరిపోయే ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్.. ఏకంగా అంత జీబీ ర్యామే.. పండగో..!

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వన్‌ప్లస్ (Oneplus) సంస్థ కీలక ప్రకటన చేసింది. వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న వన్‌ప్లస్ 10టి (OnePlus 10T) స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు (Smartphone Sales) భారత్‌లో ఆగస్ట్ 16 (August 16) నుంచి మొదలుకానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 10T మోడల్‌లో (Oneplus 10T) 8జీబీ/128జీబీ వేరియంట్, 12జీబీ/256జీబీ వేరియంట్ విక్రయిస్తున్న వన్‌ప్లస్ 16 జీబీ ర్యామ్/256 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ 10T స్మార్ట్‌ఫోన్లను కూడా ఆగస్ట్ 16 నుంచి భారత్‌లో విక్రయించనుంది. 16జీబీ ర్యామ్‌తో అందుబాటులోకి రానున్న వన్‌ప్లస్ 10T స్మార్ట్‌ఫోన్ ధర 59,999 రూపాయలుగా ఆ సంస్థ ప్రకటించింది. వన్‌ప్లస్‌లో 10T 8జీబీ/128 స్మార్ట్‌ఫోన్ 49,999 రూపాయలు కాగా, 12జీబీ/256జీబీ స్మార్ట్‌ఫోన్ ధర 54,999 రూపాయలు.



ఇప్పుడు ఆగస్ట్ 16న భారత్‌లో అందుబాటులోకి రానున్న 16జీబీ/256జీబీ మోడల్ 10T స్మార్ట్‌ఫోన్ ధర 59,999 రూపాయలు కావడం గమనార్హం. Moonstone Black Colourway లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ మోడల్‌ను వన్‌ప్లస్ అఫిషియల్ వెబ్‌సైట్‌లోనూ (Oneplus.in), వన్‌ప్లస్ స్టోర్ట్స్‌ యాప్‌లోనూ (Oneplus Store App), ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లోనూ (Amazon) విక్రయించనున్నారు. ఆగస్ట్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత్‌లో ఈ ఫోన్ విక్రయాలు మొదలుకానున్నాయి. One Plus 10T సిరీస్‌లో వస్తున్న ఈ 16 జీబీ ర్యామ్ మోడల్‌లో విశేషాలేంటంటే.. ఈ ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ర్యామ్ గురించి.



ఒక స్మార్ట్‌ఫోన్‌లో 16 జీబీ ర్యామ్ అంటే దాదాపు ప్రీమియమ్ ల్యాప్‌టాప్‌లో ఉండేంత ర్యామ్‌తో సమానం. అంత ర్యామ్‌తో తయారైన OnePlus 10T స్మార్ట్‌ఫోన్ వేగవంతంగా పనిచేస్తే వినియోగదారులకు కొనుగోలు చేసినందుకు సంతృప్తి మిగిలినట్టే. డిస్‌ప్లే పరంగా చూసుకుంటే One Plus 10T 6.7 అంగుళాల స్క్రీన్‌తో ఉంటుంది. AMOLED display కాబట్టి హై క్వాలిటీ రిజల్యూషన్, HDR10+ క్వాలిటీ వీడియోలను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 16MP సెల్ఫీ కెమెరా, Corning Gorilla Glass 5 Protection, In-display Fingerprint Scanner ఈ ఫోన్‌లో ఇతర ఫీచర్లు. Moonstone Black, Jade Green కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. Qualcomm Snapdragon 8 Plus Gen 1 chip, OxygenOS 12.1 based on Android 12 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందడం విశేషం. బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే.. 4,800mAh బ్యాటరీ సామర్థ్యంతో తయారైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 150W Fast Charging ప్రత్యేకతగా చెప్పొచ్చు.

Updated Date - 2022-08-12T22:41:45+05:30 IST