విద్యా సంవత్సరం కోల్పోయిన గర్భిణి

ABN , First Publish Date - 2022-05-18T06:23:40+05:30 IST

నాయుడుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓ గర్భిణిని పరీక్ష రాయనీయకుండా బయటకు పంపడం చర్చనీయాంశమైంది.

విద్యా సంవత్సరం కోల్పోయిన గర్భిణి
అంకాళమ్మ

పరీక్షలు రాయడాన్ని అడ్డుకున్న ప్రిన్సిపాల్‌ 

నాయుడుపేట , మే 17 :  నాయుడుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓ గర్భిణిని పరీక్ష రాయనీయకుండా బయటకు పంపడం చర్చనీయాంశమైంది. నాయుడుపేట లోని చంద్రబాబు కాలనీకి చెందిన 6 నెలల గర్భిణి అంకాళమ్మ ఒకేషనల్‌ కోర్సు (ఎంఎల్‌టీ)లో పాథాలజీ పరీక్ష రాసేందుకు కళాశాలకు మంగళవారం వచ్చింది.పరీక్ష రాస్తుండగా ఆమెకు వాంతి అయింది.అది కొంత పరీక్ష రాసే బుక్‌లెట్‌ మీద పడింది. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ ఆ బుక్‌లెట్‌ తీసుకొని తనను పరీక్ష హాల్‌నుంచి బయటకు పంపినట్లు అంకాళమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.పరీక్ష రాయకపోతే విద్యాసంవత్సరం కోల్పోతానని ప్రిన్సిపాల్‌ను ఎంత ప్రాధేయపడినా ఆమె కనికరించలేదని అంకాళమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.గర్భిణులు పరీక్షకు హాజరైతే వారికే విధమైన ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాల్సివుండగా తనకు ఇలా అన్యాయం జరిగిందని అంకాళమ్మ వాపోయింది. 


Updated Date - 2022-05-18T06:23:40+05:30 IST