కశ్మీర్‌లో చొరబాటు యత్నం భగ్నం

ABN , First Publish Date - 2020-08-10T07:49:59+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఉగ్రవాదులు చొరబాటుకు చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ ప్రయత్నంలో ఓ ఉగ్రవాది హతమవగా...

కశ్మీర్‌లో చొరబాటు యత్నం భగ్నం

  • ఓ ఉగ్రవాది హతం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు


జమ్ము, ఆగస్టు 9: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఉగ్రవాదులు చొరబాటుకు చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ ప్రయత్నంలో ఓ ఉగ్రవాది హతమవగా.. మరో ఇద్దరు ముష్కరులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం కృష్ణ ఘాటీలో ఉగ్రవాదుల బృందం చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్లు బలగాలు గమనించి వెంటనే అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవగా.. మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉగ్రవాది మృతదేహాన్ని అతని సహచరులు లాక్కుపోయారని, ఘటనా స్థలంలో ఒక ఏకే47 రైఫిల్‌, రెండు ఏకే47 మేగజీన్లు, తినుబండారాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తినుబండారాలు, ఇతర వస్తువులపై పాకిస్థాన్‌ గుర్తులున్నాయని, కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాక్‌ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఈ గుర్తుల ద్వారా తేటతెల్లమవుతోందని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-10T07:49:59+05:30 IST