Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 7 2021 @ 06:40AM

encounter : గుర్తుతెలియని ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో గుర్తుతెలియని ఉగ్రవాది ఒకరు హతమయ్యారు. బుద్గాం జిల్లా మోచ్వా ప్రాంతంలో భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున గాలిస్తుండగా గుర్తుతెలియని ఉగ్రవాది తన వద్ద ఉన్న ఏకే 47 రైఫిల్ తో కాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గుర్తుతెలియని ఉగ్రవాది మరణించాడు. సంఘటన స్థలంలో పోలీసులకు ఒక ఏకే -47 రైఫిల్,ఒక పిస్టల్ లభించాయి. భద్రతాబలగాలు శనివారం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. శుక్రవారం రాత్రి రాంబాన్ జిల్లా బనిహాల్ ప్రాంతంలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రాజౌరి జిల్లా తన్నమండీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల సంచారం పెరగడంతో భద్రతా బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. దీంతో తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.


Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement