ఐఫోన్‌ 13 సిరీస్‌కు ఒక టీబీ స్టోరేజ్‌!

ABN , First Publish Date - 2021-06-05T05:35:19+05:30 IST

ఐఫోన్‌ 13 ప్రొ, ఐఫోన్‌ 13 ప్రొ మాక్స్‌ రాబోయే వాటిల్లో ఒక టెరాబైట్‌ స్టోరేజ్‌ సదుపాయాన్ని యాపిల్‌ కలుగజేయనుందని సమాచారం.

ఐఫోన్‌ 13 సిరీస్‌కు  ఒక టీబీ స్టోరేజ్‌!

ఐఫోన్‌ 13 ప్రొ, ఐఫోన్‌ 13 ప్రొ మాక్స్‌ రాబోయే వాటిల్లో ఒక టెరాబైట్‌ స్టోరేజ్‌ సదుపాయాన్ని యాపిల్‌  కలుగజేయనుందని సమాచారం. 13 మోడల్స్‌కు లైడార్‌ సెన్సర్లను కూడా జతచేయనుంది. వెడ్‌బుష్‌ అనలిస్ట్‌ అందించిన సమాచారం ప్రకారం ఒక టెరాబైట్‌ స్టోరేజ్‌ కలిగిన టాప్‌ ఎండ్‌ డివైజ్‌లకు తోడు లో వేరియంట్‌లను కూడా అందుబాటులో ఉంచనుంది. కొత్త సిరీస్‌ను ఈ ఏడాదే యాపిల్‌ విడుదల చేయనుంది. ఐఫోన్‌ 13 రోజ్‌ పింక్‌ కలర్‌లో విడుదల కానుందని భోగట్టా.

120 హెచ్‌జెడ్‌ ప్రొమోషన్‌  డిస్‌ప్లే అదీ ఎప్పటికీ ఉండేలా తదుపరి ఐఫోన్‌ రానుందని అంటున్నారు. ఎల్లప్పుడూ కనిపించే డిస్‌ప్లేలో టైమ్‌, బ్యాటరీ పర్సంటేజ్‌, ఇన్‌కమింగ్‌ నోటిఫికేషన్స్‌ మాత్రమే దర్శనమిస్తాయి. అయితే ఈ ఏర్పాటులో బ్యాటరీ వినియోగాన్ని యాపిల్‌ ఎలా తగ్గిస్తుందో చూడాల్సి ఉంది. డిజి టైమ్స్‌ ప్రకారం 13 సిరీస్‌ మోడల్స్‌ సెన్సర్‌ - షిప్ట్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో రానున్నాయి. టాప్‌ ఎండ్‌ వ్యయభరిత ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్‌ ఇప్పటివరకు ఉంది. కెమెరా సెన్సర్‌ను స్టెబిలైజ్‌ చేసి  ఇది  ఫొటో క్వాలిటీని మెరుగుపరుస్తుంది. 

Updated Date - 2021-06-05T05:35:19+05:30 IST