ఆపదలో ఉన్న మహిళలకు వన్‌స్టాప్‌ సెంటర్‌ ఆపన్న హస్తం

ABN , First Publish Date - 2022-07-07T04:23:06+05:30 IST

ఆపదలో ఉన్న మహిళలకు వన్‌స్టాప్‌ సెంటర్‌ ఆపన్న హస్తం అందిస్తుందని, అక్కడ వారికి అనేక సేవలు లభిస్తాయని డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. కవిత పేర్కొన్నారు.

ఆపదలో ఉన్న మహిళలకు  వన్‌స్టాప్‌ సెంటర్‌ ఆపన్న హస్తం
వన్‌స్టాప్‌ సెంటర్‌లోని మహిళలతో మాట్లాడుతున్న జడ్జి కవిత

 సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత

కడప రూరల్‌, జూలై 6: ఆపదలో ఉన్న మహిళలకు  వన్‌స్టాప్‌ సెంటర్‌ ఆపన్న హస్తం అందిస్తుందని, అక్కడ వారికి అనేక సేవలు లభిస్తాయని డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. కవిత పేర్కొన్నారు. రిమ్స్‌లోని వన్‌స్టాప్‌ సెంటర్‌, కడప నగరం ప్రకాష్‌ నగర్‌లోని ఇంటిగ్రేటేడ్‌ హాస్టల్‌, ప్రభుత్వ కళాశాల బాలురవసతి గృహాన్ని విజిట్‌ చేశారు. ఆపదలో ఉన్న మహిళలు ఈ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వన్‌స్టాప్‌ సెంటర్‌లోని మహిళలతో మాట్లాడారు. రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం వసతి గృహంలోని వంటగదులను, వసతి గదులను, టాయిలెట్స్‌, పరిసరాలను, భోజన సదుపాయాలను పరిశీలించారు. 


Updated Date - 2022-07-07T04:23:06+05:30 IST