ఒకే రాష్ట్రం ఒకే రాజధాని.. అది అమరావతి: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-06T00:35:51+05:30 IST

‘‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. అదీ అమరావతి మాత్రమే. ఇదే కాంగ్రెస్‌ పార్టీ విధానం’’ ఇదే నినాదమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పునరుద్ఘాటించారు.

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని.. అది అమరావతి: తులసిరెడ్డి

కడప: ‘‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. అదీ అమరావతి మాత్రమే. ఇదే కాంగ్రెస్‌ పార్టీ విధానం’’ ఇదే నినాదమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పునరుద్ఘాటించారు. అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరుగుతున్న మహాపాదయాత్రకు తులసిరెడ్డి సంపూర్ణ సంఘీభావం తెలియజేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉన్న అమరావతి రాష్ట్రం నడిబొడ్డులో ఉందని, రూ.9,500 కోట్లు ప్రజాధనం ఖర్చుచేయడం జరిగిందన్నారు. 2015 అక్టోబరు 22న విజయదశమి నాడు ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్టణానికి మార్చాలని సీఎం జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రక తప్పిదమని విమర్శించారు. మహాపాదయత్రతోనైనా కనువిప్పు కలిగి రాష్ట్ర సచివాలయాన్ని (రాజధానిని) అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలించాలనే నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-06T00:35:51+05:30 IST