ఈ సంకేతాల్ని అర్థం చేసుకోండి!

ABN , First Publish Date - 2021-04-21T06:22:57+05:30 IST

ప్రేమంటే రెండు మనసుల జంట ప్రయాణం. కానీ వన్‌సైడ్‌ లవ్‌లో అలా కాదు. అవతలి వారు ఇష్టపడినా లేకున్నా ప్రేమిస్తుంటారు వన్‌సైడ్‌ లవర్స్‌. వారిపై రొమాంటిక్‌ ఫీలింగ్స్‌తో ఉంటూ ఎప్పుడో ఒకప్పుడు వారి మనసు మారకపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే ప్రేమను గుర్తించని వారి గురించి ఆలోచిస్తూ సమయాన్ని...

ఈ సంకేతాల్ని అర్థం చేసుకోండి!

ప్రేమంటే రెండు మనసుల జంట ప్రయాణం. కానీ వన్‌సైడ్‌ లవ్‌లో అలా కాదు. అవతలి వారు ఇష్టపడినా లేకున్నా ప్రేమిస్తుంటారు వన్‌సైడ్‌ లవర్స్‌. వారిపై రొమాంటిక్‌ ఫీలింగ్స్‌తో ఉంటూ ఎప్పుడో ఒకప్పుడు వారి మనసు మారకపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే ప్రేమను గుర్తించని వారి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దని చెబుతున్నారు లవ్‌గురూలు. వన్‌సైడ్‌ లవ్‌కు బై బై చెప్పాల్సిన సమయం వచ్చిందని చెప్పకనే చెప్పే కొన్ని సంకేతాలివి..


భిన్న వ్యక్తిత్వం: ప్రతి ఒక్కరికి ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తి మీతో తప్ప అందరితో కలుపుగోలుగా, స్నేహంగా ఉంటున్నారంటే మీ ఇద్దరివి భిన్న ధ్రువాలని అర్థం. మీరు ఏది చేసినా కూడా వారికి మీపై ఉన్న అభిప్రాయం మాత్రం మారదు. ఎందుకంటే మీరు వారికి తగిన జత కాదని వారి మనసుకు అనిపిస్తూ ఉంటుంది. 


ఫోన్‌ ప్రపంచంగా: మీతో మాట్లాడుతున్నప్పుడు మీ కళ్లలోకి చూడకుండా తన ఫోన్‌ వంకే చూస్తూ ఉంటారు. స్నేహితులకు మెసేజ్‌లు పంపడం లేదా సోషల్‌ మీడియా సందేశాలు చూస్తారు. సాధ్యమైనంత వరకు మీరు చెప్పే విషయం మీద తనకు ఆసక్తి లేనట్టుగా ప్రవర్తిస్తారు. 


ఎమోషన్స్‌: ప్రేమించిన వారి కష్టసుఖాలు పంచుకోవాలనుకుంటారు ఏ ప్రేమికులైనా. కానీ మీరు వన్‌సైడ్‌ లవ్‌ చేసే వారు మాత్రం ఎప్పుడూ తమ ఫీలింగ్స్‌నే చెబుతూ ఉంటారు. అంతేకానీ మీ భావాల గురించిగానీ, మీరు ఎలా ఉన్నారు అని గానీ ఒక్కసారైనా అడగరు. 


బీజీగా ఉండడం: మీరంటే ఇష్టం లేని వారు అవసరంలో మీవద్దకు రారు. తమకు ఇష్టమైన వారితో ఎక్కువగా మాట్లాడుతుంటారు. మీరు ప్లాన్‌ చేసిన చిన్న చిన్న పార్టీలను కూడా ఏదో అత్యవసర పని పేరు చెప్పి రద్దయ్యేలా చేస్తారు. మీతో కాసింత సమయం కూడా గడిపేందుకు ఇష్టం చూపరు.


స్పష్టంగా చెప్పలేకపోవడం: మీకు వారిపై ఉన్న ఫీలింగ్స్‌ను చెప్పినా కూడా వారు మిమ్మల్ని వేచి చూసేలా చేయడమే కాదు ఏ విషయం చెప్పడం లేదంటే మీ వన్‌సైడ్‌ లవ్‌కు బ్రేక్‌ పడిందని గ్రహించాలి. వారి మనసులో మీకు స్థానం లేదని తెలుసుకోవాలి.


ఫ్రెండ్‌గానే చూడడం: ఎంతగా వారిని ఆరాధిస్తున్నా కూడా తన స్నేహితులకు మిమ్నిల్ని ఒక ఫ్రెండ్‌గానే పరిచయం చేయడం, తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మీరు ఎవరో తెలియకపోవడం కన్నా వేదన మరొకటి ఉండదు. పార్టీలు, ఫ్రెండ్స్‌ అందరూ కలిసి దిగిన ఫొటోలో మిమ్మల్ని ట్యాగ్‌ చెయ్యడం లేదంటే వారు మిమ్మల్ని దూరం పెడుతున్నారని గ్రహించాలి.


Updated Date - 2021-04-21T06:22:57+05:30 IST