ఒక్కో పనికి ఒక్కో రేటు

ABN , First Publish Date - 2021-07-31T04:31:17+05:30 IST

గట్టు తహసీల్దార్‌ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది.

ఒక్కో పనికి ఒక్కో రేటు
తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ఆన్‌లైన్‌ సర్వీస్‌ కేంద్రాలు

- భూ రిజిస్ర్టేషన్‌లో ఆన్‌లైన్‌ సర్వీస్‌ కేంద్రాల నిర్వాహకులదే హవా

- రైతులతో ఇష్టానుసారంగా వసూళ్లు 

- అవినీతికి నిలయంగా తహసీల్దార్‌ కార్యాలయం

గట్టు, జూలై 30: గట్టు తహసీల్దార్‌ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. కార్యాలయంలో పైరవీకారులదే రాజ్యంగా మారింది. కార్యాలయంలో ఏ చిన్న పని జరుగాలన్నా వారిని ఆశ్రయించాల్సిందే.  వీరిని ప్రసన్నం చేసుకుంటేనే కార్యాలయంలో ఫైలు కదులుతోంది లేదంటే అంతే. ప్రధానంగా వీరిని ప్రోత్స హిస్తున్నది కార్యాలయ సిబ్బందే అన్నది బహిరంగ ర హస్యం. ఇదే అదునుగా భావించి పైరవీకారులు ఒక్కో పనికి ఒక్కో రేటును నిర్ధారించి, రైతులతో దండుకుం టున్నారు. ఇంత జరుగుతున్నా, అధికారులు పైరవీకా రులపై దృష్టి సారించక పోవడం మండలంలో చర్చానీ యాంశంగా  మారింది. రోజుల తరబడి తిరగలేక, గత్యంతరం లేని స్థితిలో పైరవీకారులను ఆశ్రయించా ల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉం డేవి కావని, నేరుగా వెళ్లి పనులు చేయించుకునేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి ఫైలు ముందుకు కదులాలంటే అన్నిస్థాయిల్లో ఉండే సిబ్బంది చేతులు తడుపాల్సిందేనని ప్రజలు ఆరోపిస్తున్నారు.  

 భూ రిజిస్ర్టేషన్‌లో దోపిడీ..  

 ప్రధానంగా గట్టు తహసీల్దార్‌  కార్యాలయంలో భూ రిజిస్ర్టేషన్‌ విషయంలో  రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అధికారులకు, పైరవీకారులకు, ఆన్‌ లైన్‌ సర్వీస్‌ కేంద్రాల  నిర్వాహకులకు భూ రిజిస్ర్టేషన్‌   ప్రధాన ఆధాయ వనరుగా మారింది. రిజిస్ర్టేషన్‌ విష యంలో రైతులకు అవగాహన లేక పోవడంతో  ఆన్‌లై న్‌ సర్వీస్‌ కేంద్రాల నిర్వాహకులతో పైరవీకారులు కు మ్ముకై ప్రభుత్వం నిర్ధారించిన ధరలకంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న అరోపణలు ఉన్నాయి. భూము లు రిజిస్ర్టేషన్‌ చేసుకోవడానికి  ముందుగా ఆన్‌లైన్‌ సర్వీస్‌  సెంటర్‌లో గానీ, మీసేవా ద్వారా గానీ,  స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులకు నిర్ణీత ధరలు తెలియకపోవడంతో ఆన్‌లైన్‌ సర్వీస్‌ కేంద్రాల నిర్వాహకులు ఎంత అడి గితే అంత చెల్లించుకోక తప్పడంలేదు. దీంతో సర్వీస్‌ కేంద్రాల నిర్వాహకుల వ్యా పారం మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతోంది. దాంతో గట్టు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆన్‌లైన్‌ సర్వీస్‌ కేంద్రాలు పుట్ట గొడుగుల్లా పుట్టకొస్తున్నాయి. ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్‌ డబ్బాలు వెలుస్తున్నప్పటికీ అధికారులు మా త్రం తమకేమీ పట్టన్నట్లు  వ్యవహరిస్తున్నారు. స్లాట్‌ బుకింగ్‌ నుంచి కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ పూర్తయ్యే వరకు   ఆన్‌లైన్‌ సర్వీస్‌ నిర్వాహకులు సబ్‌ రిజిస్ర్టార్‌ గదిలో తిష్టి వేస్తూ అంతా వారే నిర్వహిస్తుం డటంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం పారదర్శకం గా ప్రజలకు చేరువకావాలని చూస్తున్నా అక్రమార్కు లు మాత్రం ఏదో ఒక దారిని వెతుకుతూ ప్రభుత్వ లక్ష్యాన్ని తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు గట్టులో గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధి కారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు. 


అధికంగా వసూలు చేస్తే చర్యలు 

 భూ రిజిస్ర్టేషన్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవు. అధి కంగా వసూలు చేసినట్లు తన దృష్టికి రాలేదు. రైతులను విచారి స్తాను. కార్యాలయంలో పైరవీకారుల పనులు చేయొద్దని సి బ్బందిని ఆదేశిస్తా. ప్రజలు నేరుగా కార్యాలయంకు వచ్చి పనులు చేసుకోవాలి. 

- హమ్మద్‌ఖాన్‌, తహసీల్దార్‌, గట్టు 

Updated Date - 2021-07-31T04:31:17+05:30 IST