హార్ట్‌ మానిటరింగ్‌కు ‘వన్‌ ప్లస్‌ బాండ్‌’

ABN , First Publish Date - 2021-01-16T05:30:00+05:30 IST

గుండె రేటు, ఎస్‌పిఒ2 బ్లడ్‌ శాచ్యురేషన్‌ మానిటరింగ్‌ కోసం ఉపయోగపడే ‘వన్‌ ప్లస్‌ బాండ్‌’ని కొద్ది రోజుల క్రితమే భారత దేశంలోనూ ఆరంభించారు. పద్నాలుగు రోజుల పాటు బ్యాటరీ లైప్‌ ఉంటుంది. డ్యూయల్‌(రెండు) కలర్‌ స్ట్రాప్స్‌ ఉంటాయి...

హార్ట్‌ మానిటరింగ్‌కు ‘వన్‌ ప్లస్‌ బాండ్‌’

గుండె రేటు, ఎస్‌పిఒ2 బ్లడ్‌ శాచ్యురేషన్‌ మానిటరింగ్‌ కోసం ఉపయోగపడే ‘వన్‌ ప్లస్‌ బాండ్‌’ని కొద్ది రోజుల క్రితమే భారత దేశంలోనూ ఆరంభించారు. పద్నాలుగు రోజుల పాటు బ్యాటరీ లైప్‌ ఉంటుంది. డ్యూయల్‌(రెండు) కలర్‌ స్ట్రాప్స్‌ ఉంటాయి. ఔట్‌డోర్‌ రన్‌, ఇండోర్‌ రన్‌, ఇండోర్‌ సైక్లింగ్‌, ఎల్లిప్టికల్‌ ట్రైనర్‌, రోయింగ్‌ మెషీన్‌, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, పూల్‌ స్విమ్మింగ్‌, యోగా, ఉచిత శిక్షణ సహా మొత్తమ్మీద 13 ఎక్స్‌ర్‌సైజ్‌ మోడ్స్‌ని ఆఫర్‌ చేస్తోంది.


1.1 ఇంచీల అమోల్డ్‌ డిస్‌ప్లేతో ఈ బాండ్‌ ఇండియాలో రూ.2,499కి లభిస్తుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తదితరాల ద్వారా దీన్ని పొందవచ్చు. మూడు రంగుల్లో అంటే బ్లాక్‌, నేవీ, టాంజరీన్‌ గ్రే   స్ట్రాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అప్పుడు వీటి ధర రూ.3,999. ఒన్‌ప్లస్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఆఫ్‌ లైన్‌ స్టోర్స్‌ అలాగే దాంతో భాగస్వామ్యమం కలిగిన ఔట్‌లెట్స్‌లోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అడ్జస్ట్‌ చేయదగ్గ బ్రైట్‌నెస్‌తో 126 గీ 294 పిక్సల్‌ సౌకర్యం ఉంది. వినియోగదారులు కనెక్ట్‌ కాగలిగితే వన్‌ప్లస్‌ హెల్త్‌ యాప్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఆరోగ్య సమాచారాన్ని పొందవచ్చు.  

Updated Date - 2021-01-16T05:30:00+05:30 IST