గేదెను ఢీకొన్న బైక్‌

ABN , First Publish Date - 2021-05-17T04:46:44+05:30 IST

స్థానిక తాళమ్మగుడి సమీపంలో ఆదివారం గేదెను ఢీకొని స్కూటరిస్టు గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు స్థానిక చిన్నమసీదు ప్రాంతానికి చెందిన బ్రజిల్‌ గూడూరువైపు బైక్‌పై వస్తున్నాడు.

గేదెను ఢీకొన్న బైక్‌

 స్కూటరిస్టుకు గాయాలు

గూడూరురూరల్‌, మే 16: స్థానిక  తాళమ్మగుడి సమీపంలో ఆదివారం గేదెను ఢీకొని స్కూటరిస్టు గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు స్థానిక చిన్నమసీదు ప్రాంతానికి చెందిన బ్రజిల్‌ గూడూరువైపు బైక్‌పై వస్తున్నాడు. అదే సమయంలో రోడ్డుకు పక్కనే ఉన్న పొలం నుంచి గేదె అడ్డురావడంతో అదుపుతప్పి గేదెను ఢీకొని గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో బనిగీసాహెబ్‌పేటలో విధులు ఉన్న  ఒకటో పట్టణ ఎస్‌ఐ బ్రహ్మనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని  క్షతగాత్రుణ్ణి తన వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో మానవతా దృక్పథంతో వ్యహరించిన ఎస్‌ఐకి పలువురు అభినందనలు తెలిపారు.












Updated Date - 2021-05-17T04:46:44+05:30 IST