ఘర్షణలో ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2021-01-16T05:19:33+05:30 IST

మండలంలోని వెంకన్నపాళెంలో శుక్రవారం గ్రామ దేవత గంగమ్మ గ్రామోత్సవంలో జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.

ఘర్షణలో ఒకరికి గాయాలు
తీవ్రంగా గాయపడిన నారాయణ

కోట, జనవరి 15 : మండలంలోని వెంకన్నపాళెంలో శుక్రవారం గ్రామ దేవత గంగమ్మ గ్రామోత్సవంలో జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని గ్రామ దేవత గంగమ్మ గంగపెట్టెతో గ్రామోత్సవం ప్రారంభమైంది. ఉత్సవ విగ్రహ ప్రభ కిందపడిపోవడంతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. గంగపెట్టి దగ్గర ఉన్ననారాయణ  తలపై ఒక వర్గం వారు బలంగా కొట్టి గాయపరిచారు. ఆయనను చికిత్స నిమిత్తం కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ఎస్సై మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని రెండు వర్గాలను సర్దుబాటు చేశారు. వెంకనపాళెం గ్రామస్థులు భయం భయంగా ఉన్నారు.


Updated Date - 2021-01-16T05:19:33+05:30 IST