Abn logo
Sep 21 2020 @ 05:02AM

ఢిల్లీ అత్యాచార కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Kaakateeya

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఓ మహిళ అత్యాచారానికి గురవగా.. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సులభంగా లోన్ ఇప్పిస్తామని నిందితులు బాధితురాలికి చెప్పగా.. వారి మాటలు నమ్మి సెప్టెంబర్ 19వ తేదీన బాధితురాలు నిందితులు ఉన్న హోటల్‌కు వెళ్లినట్టు పోలీసులు చెప్పారు. హోటల్‌ రూంకు వెళ్లిన బాధితురాలిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. బాధితురాలు మొత్తం ఆరుగురిపై ఫిర్యాదు చేసిందని.. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మనోజ్ శర్మ అనే నిందితుడు తమ అదుపులో ఉన్నాడని.. మిగతా వారిని పట్టుకునే పనిలో ఉన్నామన్నారు. కాగా.. బాధితురాలు టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తోందని.. డబ్బులు అవసరమై లోన్ వస్తుందనే ఆశతో హోటల్‌కు వెళ్లిందని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement