Abn logo
Apr 4 2020 @ 21:19PM

‘వి’లో విలన్ నాని ఒక్కడే కాదు

Kaakateeya

నాని విలన్‌గా, సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘వి’. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


ఈ సినిమాలో నాని మాత్రమే విలన్ కాదంట. నానికి జతగా నటిస్తున్న అదితిరావు హైదరి కూడా విలన్‌గానే కనిపించనుందట. నాని కంటే కూడా ఆమె సీన్స్ ఈ చిత్రంలో హైలెట్‌గా ఉంటాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక మరో హీరో సుధీర్ బాబు సరసన ఈ చిత్రంలో నివేథా థామస్ నటిస్తుంది. తొలిసారి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. 

Advertisement
Advertisement
Advertisement