Abn logo
Mar 28 2020 @ 17:04PM

బాలీవుడ్‌లో సింగం 3.. మ‌రో హీరో కూడా!

త‌మిళంలో సూర్య‌,హ‌రి కాంబినేష‌న్‌లో సింగం సీక్వెల్ రూపొందిన సంగ‌తి తెలిసిందే. దీన్నీ అజ‌య్ దేవ‌గ‌ణ్‌ హీరోగా రోహిత్ శెట్టి బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ద‌క్షిణాదిన మూడు పార్టులు రూపొందితే.. ఉత్త‌రాదిన మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పార్టులు మాత్ర‌మే రూపొందింది. తాజాగా రోహిత్ శెట్టి మూడో పార్టును తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. బాలీవుడ్ సింగం 3లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో పాటు మ‌రో హీరో కూడా నటించ‌బోతున్నాడ‌ట‌. ఇంత‌కు ఆ మూడో స్టార్ హీరో ఎవ‌రో కాదు.. అక్ష‌య్ కుమార్ అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement