Abn logo
Jun 30 2020 @ 18:18PM

‘లూసిఫర్’ రీమేక్‌లో ఖుష్భూ, జగ్గుభాయ్.. నిజమేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ‘ఆచార్య’ తర్వాత మలయాళంలో మంచి విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సుజీత్ ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా (లూసిఫర్ ఒరిజినల్‌లో మోహన్‌లాల్ సోదరిగా మంజు వారియర్ నటించారు) అంటూ ఇప్పటికే విజయశాంతి, సుహాసినిల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు కొత్తగా చిరంజీవి సోదరిగా ఖుష్భూ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఖుష్భూ రెండో భర్తగా (మంజు వారియర్ రెండో భర్తగా చేసిన వివేక్ ఒబెరాయ్ పాత్రలో) జగపతిబాబును అనుకుంటున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలైనా నిజమో లేదంటే.. మళ్లీ రెండు రోజులకి మరో రెండు పేర్లు వినిపిస్తాయో? ఏదిఏమైనా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఇలాంటి వార్తలు మాత్రం ఆగవు.

  

ఇక ఈ సినిమాలో మంజు వారియర్ పాత్ర చాలా టిపికల్‌గా ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోవడం, తమ్ముడైన హీరోని అసహ్యించుకోవడం, మొదటి భర్తకు పుట్టిన అమ్మాయి తీరుకి ఆమె రియాక్షన్, చివరిలో పోలీస్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, పోలీస్ పెట్టే బాధ నుంచి విముక్తి కోసం తమ్ముడు సహాయం కోరడం వంటి వైవిధ్యమైన కోణాలు ఈ పాత్రలో ఉన్నాయి. నిజంగా ఖుష్భూ ఈ పాత్ర చేస్తే.. పాత్రకే నిండుతనం వస్తుంది. తెలుగులో ఆమె పాత్రకు ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే వివేక్ ఒబెరాయ్ పాత్ర చాలా కన్నింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రకు జగ్గూభాయ్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతారు. మరి అఫీషియల్‌గా ఈ పాత్రల్లో ఎవరు నటించనున్నారో తెలియాలంటే మాత్రం చిత్రయూనిట్ నుంచి ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.

Advertisement
Advertisement
Advertisement