Abn logo
Jul 10 2020 @ 23:03PM

‘బిగ్‌బాస్ సీజన్ 4’లోకి మరో హీరోయిన్

బిగ్‌బాస్‌పై ఈ మధ్య బాగా వార్తలు గుప్పుమంటున్నాయి. తెలుగు బుల్లితెరపై అత్యంత పాపులారిటీ సంపాదించిన ఈ రియాలిటీ షో ప్రజలకు విపరీతంగా ఎక్కేసింది. అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా బిగ్‌బాస్ ఉండకపోవచ్చు అనే టాక్ నడిచింది. కానీ... బిగ్ బాస్ ఖచ్చితంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్-4కి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ షో స్టార్ట్ కానుందని సమాచారం. ఇప్పటికే అన్నపూర్ణలో బిగ్‌బాస్ హౌస్ సెట్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. 


ఇక ఈసారి కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై అందిలో కూడా ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వస్తున్నప్పటికీ... ఈసారి హీరోయిన్లు కూడా ఇందులో ఉండనున్నారనే టాక్ నడుస్తోంది. వారిలో ముఖ్యంగా శ్రద్ధాదాస్, హంసానందినీ, ప్రియా వడ్లమాని, యామినీ భాస్కర్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మరో హీరోయిన్ ఇందులో యాడ్ కాబోతున్నట్లుగా టాక్. ‘కమిట్‌మెంట్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రమ్య పసుపులేటి కూడా ఈసారి బిగ్‌బాస్ సీజన్ 4లో మెరవనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి బిగ్‌బాస్ సీజన్ 4 లో ఎక్కువగా హీరోయిన్లే మెరవబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది.    

Advertisement
Advertisement
Advertisement