Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 13 Dec 2021 17:10:42 IST

‘ఆరాధన’ టైటిల్‌‌తో మరో చిత్రం.. హృద్యమైన ప్రేమకథ

twitter-iconwatsapp-iconfb-icon
ఆరాధన టైటిల్‌‌తో మరో చిత్రం.. హృద్యమైన ప్రేమకథ

‘ఆరాధన’ టైటిల్‌తో ఇప్పటికే నాలుగైదు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే టైటిల్‌తో మరో చిత్రం తెరకెక్కబోతోంది. ఆర్. వి. జి మూవీజ్, రెబెల్ నేషన్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ విభిన్న ప్రేమకథా చిత్రంతో నిర్మాతగా రవికిరణ్, దర్శకుడిగా వశిష్ట పార్థసారధి, హీరోగా పృథ్విరాజ్‌లు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) ఈ చిత్రానికి మరో నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్ర పోషిస్తున్న.. ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత-రెబెల్ నేషన్ అధినేత రవికిరణ్ మాట్లాడుతూ... ‘‘సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ‘హృద్యమైన ప్రేమకథ’గా అభివర్ణించేంత గొప్పగా ఈ ‘ఆరాధన’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మా దర్శకుడు వశిష్ట పార్థసారధి కృషి చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ చిరంజీవి, రాజేష్ ఖన్నాల ‘ఆరాధన’ల సరసన మా చిత్రం కూడా సగర్వంగా నిలబడుతుందనే నమ్మకం మాకుంది. ప్రస్తుతం నటీనటులు ఎంపిక జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాము..’’ అని తెలిపారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement