ఒక్క లుక్ చాలు
ABN , First Publish Date - 2021-01-24T06:47:02+05:30 IST
‘ఒక్క లుక్ చాలు’ అంటున్నారు అక్షయ్ కుమార్. ‘బచ్చన్పాండే’గా ప్రేక్షకులను మెప్పించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘బచ్చన్పాండే’.
‘ఒక్క లుక్ చాలు’ అంటున్నారు అక్షయ్ కుమార్. ‘బచ్చన్పాండే’గా ప్రేక్షకులను మెప్పించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘బచ్చన్పాండే’. కొత్తలుక్తో పాటు విడుదల తేదీని ప్రకటించారు. ఈ లుక్లో మెడలో గొలుసులు, గుబురు గడ్డం, కాటారాక్ట్ కన్నుతో అక్షయ్ భీతిగొలిపేలా ఉన్నారు. ‘‘ఇతని ఒక్క లుక్ చాలు. వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకు బచ్చన్పాండే మీ ముందుకొస్తున్నాడు’’ అని అక్షయ్ సోషల్ మీడియాలో తెలిపారు. ఈ చిత్రంలో అక్షయ్ మాఫియా లీడర్ పాత్రను పోషిస్తున్నారు. కృతీసనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకుడు.