అత్యాచారానికి లక్ష ‘పరిహారం’.. తీర్పు చెప్పిన పెద్దమనుషులు

ABN , First Publish Date - 2020-04-07T19:22:57+05:30 IST

బాలికను అత్యాచారం చేసిన ఘటన లో కొందరు మధ్యవర్తులు చేరి లక్ష రూపాయల ‘పరి హారం’తో పంచాయితీని సెటిల్‌మెంట్‌ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఓ గ్రామంలో

అత్యాచారానికి  లక్ష ‘పరిహారం’.. తీర్పు చెప్పిన పెద్దమనుషులు

ఆలస్యంగా బయటపడిన ఘటన

రేగొండ(వరంగల్): బాలికను అత్యాచారం చేసిన ఘటన లో కొందరు మధ్యవర్తులు చేరి లక్ష రూపాయల ‘పరి హారం’తో పంచాయితీని సెటిల్‌మెంట్‌ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మార్చి 31వ తేదీన పదేళ్ల బాలిక తన స్నేహితులతో బయట ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఆందోళన చెందిన బాలిక ఏడుస్తూ తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వెంటనే వారు బాలికను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్ళారు. మరుసటి రోజు ఉదయం ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వారిని నిలువరించారు. విషయం బయటకు రాకుండా ఉండడానికి లక్ష రూపాయలతో సెటిల్‌మెంట్‌ చేశారు. కాగా, నిందితుడు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తాడని తెలిసింది. కాగా, ఇప్పటివరకు అత్యాచార విషయంపై ఎవరూ తనకు ఫిర్యాదు చేయలేదని, గ్రామంలో విచారణ జరిపి తగిన చర్య లు తీసుకుంటామని ఏఎస్పీ బొత బాలస్వామి తెలిపారు.

Updated Date - 2020-04-07T19:22:57+05:30 IST