jodhpurలో బైకర్లను ఢీకొట్టిన లగ్జరీ కారు..ఇంటర్నెట్‌లో షాకింగ్ దృశ్యాలు

ABN , First Publish Date - 2021-11-10T13:18:43+05:30 IST

రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ నగరంలో లగ్జరీ సెడాన్ కారు బైక్‌లపై దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు....

jodhpurలో బైకర్లను ఢీకొట్టిన లగ్జరీ కారు..ఇంటర్నెట్‌లో షాకింగ్ దృశ్యాలు

ఒకరి మృతి, 9మందికి గాయాలు

జోధ్‌పూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ నగరంలో లగ్జరీ సెడాన్ కారు బైక్‌లపై దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు.లగ్జరీ కారు రోడ్డు పక్కన ఉన్న పెంకుటిల్లుపైకి వెళ్లే ముందు పలు ద్విచక్ర వాహనాలపై నుంచి దూసుకెళ్లింది.ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.ప్రజలు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


కారు డ్రైవర్‌ శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవన్ గ్రీన్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల అమిత్ గా గుర్తించారు.‘‘ జోధ్‌పూర్‌లోని చౌపాస్ని హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిమ్స్ రోడ్డులో ఒక పెద్ద ప్రమాదం జరిగింది, అక్కడ లగ్జరీ సెడాన్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పెంకుటిల్లులోకి ప్రవేశించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు తరలించాం.’’ అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ లిఖ్మారం బటేసర్ చెప్పారు.ఈ ఘటన దురదృష్టకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.గాయపడిన వారి ప్రాణాలను కాపాడటమే మా ప్రాధాన్యత అని సీఎం పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-10T13:18:43+05:30 IST