రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-04-17T05:43:39+05:30 IST

పట్టణంలోని బీరప్ప సర్కిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని నాగూరు సిద్ధప్ప (50) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

గుంతకల్లు టౌన, ఏప్రిల్‌ 16: పట్టణంలోని బీరప్ప సర్కిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని నాగూరు సిద్ధప్ప (50) మృతి చెందాడు. స్థానికు లు తెలిపిన వివరాలివి. ఆస్పరి మండలం చిన్నహోతూరుకు చెందిన నాగూరు సిద్ధప్ప ప ట్టణంలోని బంధువుల ఇంటికి పెట్రోల్‌ బంకు వద్ద వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో కింద పడ్డ నాగూరు సిద్ధప్పపై వెనక నుంచి వచ్చిన లారీ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వనటౌన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-04-17T05:43:39+05:30 IST